-పార్టీ జెండా మోసిన వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శ
ప్రజాశక్తి-అట్లూరు
బద్వేల్ నియోజకవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తలలో ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారం రోజుల కిందట పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, జోనల్ స్థాయి నాయకులతో అమరావతిలో సమావేశమైనట్లు విశ్వనీయమైన సమాచారం. ఈ సమావేశంలో స్థాయి నాయకులతోపాటు కార్యకర్తలకు ఎటువంటి నామినేటెడ్ పదవులు కేటాయించాలో సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదువుల కేటాయింపులపై దష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతి నియోజక వర్గంలోనూ కష్టపడ్డ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమపడిపార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్న భావన మదిలో ముద్ర వేసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్‌గా పరిటాల వెంకటస ుబ్బయ్య, ఇదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్‌గా వేణు గోపాల్‌ను నియ మించారు. ఈనేపథ్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలలో ఆశలు చిగురించాయి. బద్వేల్ నియోజకవర్గంలో టిడిపిలో వర్గ విభేదాలతో కొట్టు మిట్టాడుతున్నట్లు విశ్వనీయ సమాచారం. పార్టీ జెండా మోసిన వారిని నియోజవర్గ ఇన్‌ఛార్జి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పసుపు జెండా మోస్తున్న సైనికులు ఎంతో మంది ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు నిర్వహించిన వారూ ఉన్నారు. వీరంతా పదవులపై ఆశలు పెటుకున్నారు. అయితే ఎన్నికల ముందు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారు మాత్రమే చక్రం తిప్పు తుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అసంతప్తి సెగలు కక్కుతుంది. ఈ నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ రైల్వే క్లాస్ 1 కాంట్రాక్టర్ మంచూరు. సూర్యనారాయణ రెడ్డికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి గుర్తించాలని బద్వేల్ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.
